Site icon HelloBD Newz

Soaked Peanuts: నానబెట్టిన వేరు శనగల తో అన్ లిమిటెడ్ లాభాలు..!

Soaked Peanuts

Soaked Peanuts

Soaked Peanuts: చాల మందికి ప్రతి రోజు ఉదయాన్నే నానబెట్టిన గింజలు,మొలకలు తినే అలవాటు ఉంటుంది.అయితే నానబెట్టిన వేరు శనగలు ప్రతి రోజు తినడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు.వీటి నుంచి ఎన్నో రకాలైన ప్రోటీన్లు లభిస్తాయి.ఇలా నానబెట్టిన వేరు శనగల లో శరీరానికి అవసరం అయినా లిపిడ్లు,ఫాస్పరస్,ఫైబర్,ప్రోటీన్లు,విటమిన్లు,మెగ్నీషియం అన్ని పుష్కలంగా లభిస్తాయి.100 గ్రాముల వేరు శనగల నుంచి 25 .8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి అని నిపుణులు చెప్తున్నారు.

బరువు తగ్గాలని ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇవి తినడం మంచిది.జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.వేరు శనగల లో ఉండే అధిక ఫైబర్ జీర్ణ క్రియను మెరుగు పరచడంలో సహాయం చేస్తాయి.నానబెట్టిన వేరు శనగలు తీసుకోవడం వలన గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.వీటిని నానబెట్టడం వలన వీటి పై ఉండే తొక్క కూడా నీటిని పిలుచుకుంటుంది.ఇలా తిన్న తొక్క రక్త ప్రసరణను సరిగ్గా నిర్వహించడంలో సహాయం చేస్తుంది.వీటిని తొక్క తో పాటు సేవించటం వలన గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

వెన్ను నొప్పి తో బాధపడే వారు నానబెట్టిన వేరు శనగల ను బెల్లం తో కలిపి తీసుకోవడం వలన వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు.పచ్చి వేరు శనగల ను తినడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.కంటి చూపు బలహీనంగా ఉన్న వారు,కంటి మీద ఒత్తిడి తో బాధపడుతున్న వారు సరైన పరిమాణం లో ప్రతి రోజు వీటిని తినడం వాలా జ్ఞాపకశక్తి పెరగడం తో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.పచ్చి వేరు శనగలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.ఈ రోజుల్లో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్ కారణం గా ఎక్కువ రోజుల నుంచి దగ్గు బాధిస్తున్న వారు పచ్చి వేరు శనగలు తీసుకోవడం వలన దగ్గును తగ్గించుకోవచ్చు.

Exit mobile version