Kalabanda Plant: చాలామంది తమ ఇళ్లలో కలబంద మొక్కను పెంచుతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద (Kalabanda) మొక్కలు ఇంట్లో పెంచడం చాలా శుభదాయకం అని చెప్తుంటారు. ఈ మొక్క సానుకూల శక్తిని పెంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. చాలామంది ఈ మొక్కను అదృష్టంగా భావిస్తారు. అయితే ఇటువంటి ఈ మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా మంచిది.
కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడంతో పాటు విజయానికి కూడా తోడ్పడుతుంది. వాస్తు (vastu) శాస్త్రం ప్రకారం ఈ మొక్క ఉన్నచోట శ్రేయస్సు, సంపద, ప్రేమ, ప్రతిష్ట వంటివి ఉంటాయట. అయితే ఇటువంటి ఈ మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయ దిశలో కూడా ఈ మొక్కను నాటవచ్చు. ఒకవేళ ఉద్యోగంలో పురోగతి కావాలంటే ఈ మొక్కను పడమర దిశలో నాటాలి.
పొరపాటున కూడా ఈ మొక్కను వాయువ్య దిశలో నాటకూడదు. ఈ మొక్కను వాయువ్యదిశలో కనుక నాటినట్లయితే ప్రతికూల పరిస్థితులను, అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆగ్నేయ దిశలో ఈ మొక్కను నాటడం వలన ఇంట్లో ధనం పెరుగుతుంది. ఇంటిముందు బాల్కనీలో లేదా తోటలో ఈ మొక్కను పెంచినట్లయితే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించవు.