Fever: సాధారణంగా మారుతున్న వాతావరణాన్ని బట్టి ప్రతి మనిషికి జ్వరం అనేది వస్తుంది. కానీ ఇలా జ్వరం వచ్చిన సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వలన జ్వరం నుంచి త్వరగా కోలుకోవడం కష్టమవుతుంది. అందుకనే జ్వరం వచ్చిన సమయం లో శరీరానికి తగిన శ్రద్ధ తీసుకోవడం వలన జ్వరాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు. జ్వరం (Fever) వచ్చిన సమయంలో ఇలాంటి పొరపాట్లను అసలు చేయకూడదు. జ్వరం ఉన్నప్పుడు చల్లని నీళ్లతో స్నానం చేయడం, కూల్ డ్రింక్ తాగడం, ఐస్ క్రీం తినడం వంటిది శరీరానికి చాలా ప్రమాదం.
ఇలా చేయడం వలన అవి శరీర ఉష్ణోగ్రతను అకస్మాత్తుగా తగ్గించి రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తుంది. జ్వరం వస్తున్న సమయంలో గోరువెచ్చని నీళ్లు, సూప్ వంటివి తాగడం, సున్నితమైన ఆహారం తినడం వంటివి చేయాలి. జ్వరం ఎక్కువగా ఉన్న సమయంలో పని ఎక్కువ చేయడం వలన కూడా అది ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తిని శరీరం కోల్పోతుంది. అందుకే జ్వరం వస్తున్న సమయంలో ఆఫీసు పని కానీ లేదా ఇంటి పని కానీ ఎక్కువగా చేయకూడదు.
నిపుణులు చెప్తున్నారు సలహా ప్రకారం జ్వరం వస్తున్న సమయంలో విశ్రాంతి తీసుకుని తగినంత నిద్ర తీసుకోవడం చాలా మంచిది. జ్వరం వస్తున్న సమయంలో వైద్యులను సంప్రదించకుండా సొంతంగా మందులను వేసుకోవడం కూడా చాలా ప్రమాదకరం. తేలికపాటి ఆహారం తీసుకుని, రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, ఎక్కువ నీటిని తీసుకోవడం వలన కూడా జ్వరం నుంచి త్వరగా బయటపడవచ్చు.