Dry Fish: ఎండు చేపలు వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తుంటారు. ముఖ్యంగా ఇవి ఎముకలు, దంతాల బలానికి, ఒక నిరోధక శక్తిని పెంచడానికి చాలా సాయం చేస్తాయి. కానీ గుండె సమస్యలు, షుగర్, కిడ్నీ, చర్మ సమస్యలు ఉన్నవాళ్లు ఎండు చేపలను అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎండు చేపలు ప్రత్యేకమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఎండు చేపలను కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం అసలు తినకూడదు.
ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు తింటే అనుకొని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలంగా చేస్తాయి. వీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇవి మహిళలలో మూత్రాశయం, అండాశయం, గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. పాలిచ్చే తల్లులు వీటిని తింటే పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. అయితే వీటిని గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదు. వీటిలో సోడియం ఎక్కువగా ఉండడం వలన అవి రక్తపోటును పెంచే అవకాశం ఉంది.
అలాగే షుగర్ ఉన్న వాళ్ళు వీటిని తింటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలో మారిపోవచ్చు. దద్దుర్లు, పొక్కులు, గా వంటి చర్మ సమస్యలు ఉన్నవాళ్లు వీటిని తింటే అవి మరింత పెరిగే అవకాశం ఉంది. మూత్రపిండాలు సమస్యలు ఉన్నవాళ్లు వీటిని తింటే అవి మరింత పెరిగే అవకాశం. అలాగే ఈ ఎండు చేపలను మజ్జిగ, పెరుగు, ఆకుకూరలతో తినకూడదు. వీటితో కలిపి తింటే జీర్ణ సమస్యలు, ఫుడ్పాయిజన్ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎండు చేపలను తగిన పరిమితిలోనే తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహాతో వీటిని తినడం మంచిది.