Curd Combination Foods: కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ కలిపి తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను పెరుగుతో కలిపి తినకూడదని నిపుణులు చెప్తున్నారు.అలా తినడం వలన జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అయితే ప్రతిరోజు పెరుగు (Curd) తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు. పెరుగు చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు నుంచి పోషకాలు కూడా శరీరానికి చాలా లభిస్తాయి.
అయితే ఇలాంటి పెరుగును కొన్ని ఆహారాలతో కలిపి తినకూడదు. కొంతమంది ఆహారంలో పెరుగు కలుపుకుని చేపను తింటున్నారు. అయితే ఇలా తినడం వలన పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. చేపలతో భోజనం చేసిన తర్వాత కనీసం మజ్జిగ కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకున్నట్లయితే అలర్జీ, చర్మ సమస్యలు వంటివి వస్తాయి. అయితే చాలామంది పెరుగు కలిపిన అన్నంలో మామిడికాయ ముక్కలను తింటారు.
కానీ ఇలా తినడం వలన అజీర్తి,ఎసిడిటీ వంటి సమస్యలు కలుగుతాయి. మరి కొంతమంది పెరుగన్నంలో ఉల్లిపాయ కూడా నమిలి తింటారు. ఇలాగా పల్లెటూర్లలో ఎక్కువగా తింటారు. అయితే ఇలా పెరుగన్నంలో ఉల్లిపాయ తినడం వలన అజీర్తి, గ్యాస్ సమస్యలు వస్తాయి. వంకాయ టమాట కూరలో కూడా పెరుగును కలిపి తినకూడదు. దీనివలన పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు.