Coriander Juice Benefits: చాలామంది ఉదయం లేచిన వెంటనే మంచి ఆరోగ్యం కోసం కొన్ని రకాలైన పానీయాలను పరగడుపున తాగుతుంటారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం కూడా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెప్తున్నారు. ఇది మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కొత్తిమీరలో ఐరన్, ప్రోటీన్స్, విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి.
ఇవి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కొత్తిమీర లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వలన అది రక్తంలోని గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది. దీనిలో ఉండే క్యాల్షియం, పొటాషియం ఎముకలను బలోపేతం చేస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగడం వలన చెలు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా కొత్తిమీర జ్యూస్ బాగా పనిచేస్తుంది.