Toothache: ఈ ఒక్క ఆకుతో మీ పంటి నొప్పిని మరియు పిప్పి పళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు..ఆ చిట్కా ఏంటంటే…!

Toothache
Toothache

Toothache: ఈ మధ్యకాలంలో చాల మందిని వేధిస్తున్న సమస్యలలో దంతాల సమస్య కూడా ఒకటి అని చెప్పచ్చు.దంతాల సమస్యతో బాధపడుతున్న వారు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు.పంటి నొప్పితో,పిప్పి పళ్లతో ఈ మధ్యకాలంలో చాల మంది బాధపడుతున్నారు.భరించలేని పంటి నొప్పి నుండి బయట పాడటానికి చాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ సమస్య నుంచి బయటపడటానికి ఆయుర్వేదం చాల బాగా ఉపయోగపడుతుంది.చిన్న చిట్కాను ఉపయోగించి పంటి నొప్పి నుంచి,పిప్పి పళ్ళ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.జామ చెట్టు ఆకుతో పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు.ఈ జామ చెట్టు ఆకును ఉపయోగించి పంటి నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అంటే…దీని కోసం 5 లేదా 6 జామ చెట్టు ఆకులను ఒక గిన్నెలో వేసుకొని బాగా శుభ్రం చేయాలి.

ఆ తర్వాత ఆ ఆకులలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వాటిని ఒక గ్లాసు నీరు వచ్చే వరకు బాగా మరిగించాలి.తర్వాత మరిగిన మిశ్రమాన్ని వడకట్టి చల్లారే వరకు ఉంచాలి.తర్వాత దానిలో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు బాగా కరిగే వరకు కలపాలి.అలా చేసిన నీటిని నోట్లో వేసుకొని బాగా పుక్కిలించాలి.ఇలా ప్రతి రోజు ఈ నీటిని పుక్కిలించటం వలన పంటి నొప్పి,పిప్పి పళ్ళ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.ఈ నీటిని ప్రతి రోజు మూడు లేదా నాలుగు సార్లు పుక్కిలించాలి.

ఎటువంటి మందులు మరియు టూత్ పేస్ట్ లు వాడకుండానే సహజంగా పంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.ప్రతి రోజు ఇలా క్రమం తప్పకుండ చేయడం వలన దంతాల సమస్య తగ్గుతుంది.వేలకు వేలు ఖర్చు చేయడం కంటే కూడా ఈ సహజసిద్ధమైన చిట్కాను ఫాలో అయ్యి పంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.ఇలా చేయడం వలన దంతాలు మరియు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.ఇలా చేయడం వలన నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.జామ ఆకులను ఉపయోగించి ఈ చిట్కాను ను అనుసరించడం వలన అన్ని రకాల నోటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *