Salt Water: మన ఆహారంలో వాడే పదార్థాలలో ఉప్పు ముఖ్యమైనది.ఉప్పు లేని చప్ప ఆహారాన్ని అస్సలు తినలేము.అయితే ఉప్పును ఆహారంతో తీసుకోవడంతో పాటు ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉప్పును తీసుకోవడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి చాల మందికి తెలియదు.ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో ఉప్పును కలిపి ఖాళీ కడుపుతో తాగడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
ఉప్పులో కాల్షియం,మెగ్నీషియం,పొటాషియం పుష్కలంగా ఉంటాయి.ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా ప్రతి రోజు తాగడం వలన వాళ్లకు చాల మేలు అని నిపుణులు చెప్తున్నారు.ఉప్పు కలిపిన నీళ్లు ప్రతి రోజు తాగడం వలన రోజంతా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.అలాగే శరీరంలో ఎలెక్ట్రోలైట్ బాలన్స్ కూడా బాగా అవుతుంది.అనేక వ్యాధులకు ఈ నీళ్లు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.ఇందులో కాల్షియం ఉంటుంది కాబట్టి అది ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.జీర్ణ వ్యవస్థలో ఆసిడ్స్ బాలన్స్ అయ్యి మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.ఉప్పు నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.అలాగే ఈ నీళ్లు చర్మానికి కూడా చాల మేలు చేస్తాయి.ప్రతి రోజు ఈ నీళ్లు తీసుకోవడం వలన మూత్రపిండాలు,కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి.శరీరం నుంచి టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.కానీ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు,గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని పరిమితికి మించి తీసుకోకూడదు.