Site icon HelloBD Newz

Sakshi Shivanand: మహేష్ బాబు యువరాజు హీరోయిన్ ను ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలరా…!

Sakshi Shivanand

Sakshi Shivanand

Sakshi Shivanand: 90 స్ లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ సాక్షి శివానంద్.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.తెలుగు తో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ ఇలా అన్ని భాషలలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది సాక్షి శివానంద్.టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున,మహేష్ బాబు,రాజశేఖర్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది.1996 లో నటిగా సాక్షి శివానంద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ప్రేక్షకులను అలరించింది సాక్షి శివానంద్.ఆ తర్వాత నాగార్జునతో సీతారామరాజు సినిమాలో నటించింది.బోధియాల్ అనే తమిళ్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా యువరాజు సినిమాలో నటించింది.

ఈ సినిమాతో సాక్షి శివానంద్ కు మంచి ఫాలోయింగ్ క్రేజ్ ఏర్పడ్డాయి.రాజశేఖర్ కు జోడిగా సింహ రాసి సినిమాలో నటించిన సాక్షి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది.ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

ఇక ఆ తర్వాత జగపతి బాబు హోమం సినిమాతో 2008 లో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది.2010 లో రిలీజ్ అయినా శ్రీకాంత్ రంగా ది దొంగ సినిమాల సాక్షి శివానంద్ చివరి సారిగా నటించింది అని చెప్పచ్చు.ఇక ఆ సినిమా తర్వాత ఆమె మరొక సినిమాలో కనిపించలేదు.చాల ఏళ్ళ తర్వాత సాక్షి శివానంద్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో సాక్షి గుర్తుపట్టలేనంత మారిపోయింది అని చెప్పచ్చు.

Exit mobile version