Mugguru Monagallu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలలో నటించి మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను అలరించారు.కొన్ని సూపర్ హిట్ సినిమాలలో ఆయన ద్విపాత్రాభినయం కూడా చేయడం జరిగింది.ఇక తన సోదరుడు అయినా నాగబాబు (NagaBabu) స్వయంగా నిర్మించిన ముగ్గురు మొనగాళ్లు అనే చిత్రంలో చిరంజీవి (Chiranjeevi) మూడు పాత్రలలో కనిపించారు.ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో చిరంజీవి రౌడీ గా,పోలీస్ ఆఫీసర్ గా,డాన్స్ మాస్టర్ గా మూడు భిన్న పాత్రలలో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
ఘరానా మొగుడు అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్లు అనే సినిమా చేసారు.రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.మూడు భిన్నమైన పాత్రలలో చిరంజీవి అద్భుతంగా నటించడం జరిగింది.తన గొంతును,లుక్ ను కూడా పూర్తిగా మార్చేశారు చిరంజీవి.ఈ చిత్రంలో రోజా,రమ్యకృష్ణ,నగ్మా హీరోయిన్ లుగా నటించారు.
అప్పట్లో హీరోలు ద్విపాత్రాభినయం లేదా మూడు పాత్రలు చేయాలంటే డూప్ లు ఉండేవారు.ఈ సినిమాలో చిరంజీవి కి ఇద్దరు నటులు డూప్ లుగా చేసారు.ఈ చిత్రంలో చిరంజీవి కి డూప్ గా ఆయన పిఎ సుబ్బారావు,స్నేహితుడు నటుడు అయినా ప్రసాద్ రావు నటించడం జరిగింది.వీరిద్దరూ ఎత్తు,బరువు లో చిరంజీవి కి సమానంగా ఉండడం వలన వీరిద్దరూ చిరంజీవి కి డూప్ గా చేసారు.ఈ చిత్రం తర్వాత పలు సినిమాలలో కూడా వీరిద్దరూ డూప్ గా చేయడం జరిగింది.అప్పట్లో రిలీజ్ అయినా ముగ్గురు మొనగాళ్లు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కలెక్షన్ల రికార్డు రాబట్టింది.