Home » సినిమా » Rajamouli Mahesh Babu: రాజమౌళి,మహేష్ సినిమా కథ ఏంటి..జాన్ అబ్రహం,పృథ్వీరాజ్,ప్రియాంక పాత్రలేంటో తెలుసా.!

Rajamouli Mahesh Babu: రాజమౌళి,మహేష్ సినిమా కథ ఏంటి..జాన్ అబ్రహం,పృథ్వీరాజ్,ప్రియాంక పాత్రలేంటో తెలుసా.!

Rajamouli Mahesh Babu
Rajamouli Mahesh Babu

Rajamouli Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో నెలదొక్కుకోవాలంటే అంత సులభమైన పని కాదు. ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదో ఒక క్రాఫ్ట్ లో సెటిల్ అయిపోవాలని చూస్తుంటారు. కానీ ఇలా ఇండస్ట్రీలో రాణించాలంటే మొదట్లో చాలా రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తినకుండా కూడా వస్తుండు కష్టపడే రోజులు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. అయితే ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రాజమౌళికి (Rajamouli) ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా గుర్తింపు ఉంది. పాన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ పక్కన నిలబడాలని ప్రయత్నంలో రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటు నటించే ఇతర నటీనటులు ఎవరు.. ఈ సినిమా కథ ఏంటి అనే దానిమీద గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నారు అని టాక్ వినిపించింది.

కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం ( (John Abraham) ఈ సినిమాలో మహేష్ బాబును ఢీకొట్టే పాత్రలో కనిపిస్తున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఫైనల్ అయినట్టు రాజమౌళి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పృథ్వీరాజ్ సుకుమారాన్ (Prithviraj Sukumaran), జాన్ అబ్రహం వీళ్ళిద్దరిలో ఈ సినిమాలో ఎవరిని తీసుకోబోతున్నారు అనే దానిమీద ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి జాన్ అబ్రహం కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ నటులతో పాటు తమిళ్ స్టార్ హీరో విశాల్ కూడా మహేష్ బాబు సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించబోతున్నారు అని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి కూడా ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇండియానా జోన్స్ మూవీ ఇన్స్పిరేషన్తో ఈ సినిమా కథను రాసుకున్న అంటూ తెలియజేశారు. ఒక వీధి వేటలో సాగే కథగా కూడా తను కొంతవరకు ఈ స్టోరీని రివిల్ చేయడం విశేషం అని చెప్పొచ్చు.ఈ సినిమాలో మహేష్ బాబు ఒక నిధి వేటలో ముందుకు సాగుతూ అడ్వెంచర్లు చేస్తూ ఆ నిధిని దక్కించుకున్నాడా లేదా అనే ఒక క్యూరియాసిటీతో ఈ సినిమా కదా ఉండబోతుంది అని ప్రస్తుతం వినిపిస్తుంది. ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తన మేకింగ్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నాడు అంటూ చాలామంది సినిమా ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.