Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్లో వస్తున్న విశ్వంభర (Vishwambhara) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను మొదట్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ సినిమా ఉండడంతో ఈ సినిమాను వాయిదా వేశారు.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన కొంత గ్రాఫిక్ వర్క్స్ కూడా పెండింగ్లో ఉండడంతో ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇండస్ట్రీ హిట్ కొట్టిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా కూడా మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దాంతో విశ్వంభర సినిమాను కూడా మే 9న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.
యు వి క్రియేషన్స్ బ్యానర్ మీద బింబిసార దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి దాదాపు 35 ఏళ్లు అవుతుండడంతో సెంటిమెంట్ గా విశ్వంభర సినిమాను అదే రోజున రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటివరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.