Home » సినిమా » Vishal Movie: దాదాపు 12 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అవుతున్న విశాల్ సినిమా… ఇన్ని సంవత్సరాలు ఎందుకు రిలీజ్ కాలేదంటే

Vishal Movie: దాదాపు 12 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అవుతున్న విశాల్ సినిమా… ఇన్ని సంవత్సరాలు ఎందుకు రిలీజ్ కాలేదంటే

Vishal Movie
Vishal Movie

Vishal Movie: హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. పందెంకోడి సినిమాతో తెలుగు లో హిట్టు అందుకొని తన నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు హీరో విశాల్. అయితే విశాల్ నటించిన సినిమా మాత్రం ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. వివిధ కారణాల వలన దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. సౌత్ ఇండస్ట్రీలో హీరో విశాల్ (Vishal) కు మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఈ సినిమా ప్రారంభమైంది. టాప్ నటీనటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు.

ఈ సినిమా పూర్తి అయినప్పటికీ కొన్ని కారణాల వలన విడుదల కాలేదు. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు మదగజరాజా (Madha Gaja Raja) . ఈ సినిమాలో అంజలి (Anjali), వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ 2012లో పూర్తి అయ్యింది. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో సదా నటించింది. అలాగే హీరో ఆర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు. సోను సూద్, సంతానం వంటి పలువురు కూడా కీలక పాత్రలో కనిపించారు.

విజయ్ ఆంటోని ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇంత మంది టాప్ నటీనటులు ఉన్న ఈ సినిమాను అప్పట్లోనే విడుదల చేయడానికి తేదీలు కూడా ఖరారు చేశారు. అయితే కమెడియన్ సంతానం నిర్మాతలు తనకు చెప్పిన పారితోషకం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించగా సినిమా విడుదలలో సమస్యలు ఏర్పడ్డాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు మోక్షం ఏర్పడిందని తెలుస్తుంది. ఇక జనవరి 12న కోలీవుడ్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హీరో విశాల్ తానే స్వయంగా నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకొని తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.