Home » సినిమా » Uyyala Jampala: ఉయ్యాలా జంపాల చిన్నారి ప్రస్తుతం హీరోయిన్ లాగ మారిపోయింది…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.!

Uyyala Jampala: ఉయ్యాలా జంపాల చిన్నారి ప్రస్తుతం హీరోయిన్ లాగ మారిపోయింది…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.!

Uyyala Jampala
Uyyala Jampala

Uyyala Jampala: సినిమా ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరో లేదా హీరోయిన్ గా ఎదిగారు. మరి కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో చేసినప్పటికీ ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఆకోవకు చెందింది. రాజ్ తరుణ్ (Raj Tarun), అవికా గోర్ (Avika Gor) జంటగా నటించిన ఉయ్యాల జంపాల (Uyyala Jampala) సినిమా ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమాలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారి అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. తన క్యూట్ మాటలతో ఈ చిన్నారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిన్నారి హీరోయిన్ లాగా మారిపోయింది. ఈమె పేరు ప్రణవి మానుకొండ. ఉయ్యాల జంపాల సినిమాలో చేయిలాటిస్టుగా చేసిన ప్రణవి (Pranavi) ప్రస్తుతం హీరోయిన్గా చేయడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. హైదరాబాద్కు చెందిన ప్రణవి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో అడుగు పెట్టింది.

ఆ తర్వాత బుల్లితెర మీద కూడా అలరించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రణవి 50 కి పైగా సినిమాలలో నటించింది. ఉయ్యాల జంపాల సినిమాకు గాను ప్రణవి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు సీరియల్స్లలో కూడా ప్రధాన పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ప్రణవి తన ఫోటోలను షేర్ చేయడంతో పాటు రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ప్రణవి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.