Annamayya Movie: తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో అక్కినేని నాగార్జున.తన నటనతో,అందంతో అమ్మాయిల కళల రాకుమారుడిగా మన్మథుడిగా,కింగ్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.తన కెరీర్ లో ఇప్పటి వరకు నాగార్జున ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నారు.అయితే నాగార్జున కెరీర్ లో అన్నమయ్య చిత్రానికి మాత్రం ఒక ప్రత్యేక స్తానం ఉందని చెప్పచ్చు.నిన్నేపెళ్లాడతా వంటి రొమాంటిక్ స్టోరీ తర్వాత నాగార్జున రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అన్నమయ్య సినిమా ప్రకటించందో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం అందరిలోనూ కలిగింది.నాగార్జున,రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో చాల హిట్ సినిమా లు వచ్చాయి.
అయితే అన్నమయ్య చిత్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అన్నమయ్య పాత్రలో నాగార్జున (Nagarjuna) జీవించేశారనే చెప్పచ్చు.1997 లో రిలీజ్ అయినా ఈ చిత్రం ఆంధ్రదేశాన్ని భక్తి భావంతో ముంచేసింది.ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ కూడా చాల బాగా ఒదిగిపోయారు.ఈ పాత్ర ముందుగా సుమన్ చేయాల్సింది కాదట.అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తునిగా చాల సన్నివేశాల్లో ఆయన కాళ్ళ మీద పడే సీన్ లు ఉన్నాయి.
దాంతో ఒక సీనియర్ స్టార్ హీరో అయితే ఆ పాత్రకు బాగుంటుందని రాఘవేంద్ర రావు ముందుగా శోభన్ బాబు ను సంప్రదించారట.కాని ఆయన పాత్రను వదులుకోలేక రూ 50 లక్షలు కోరడంతో ఆయన్ని పక్కన పెట్టి బాలకృష్ణ (Bala Krishna) ను సంప్రదించారట.ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి పాత్రలలో కనిపిస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భావించి రాఘవేంద్ర రావు గారే వెనక్కి తగ్గారట.ఆ తర్వాత సుమన్ (Suman) అయితే బాగుంటుంది అని భావించి ఆయనను పిలిపించి కథ చెప్పారట.ఆ తర్వాత ఫోటో షూట్ కూడా నిర్వహించి సుమన్ పర్ఫెక్ట్ అని భావించి ఆయనను ఫిక్స్ చేశారట దర్శకుడు.అలా సుమన్ కూడా ఈ సినిమా సక్సెస్ అవడంలో తనవంతు పాత్ర పోషించారు.