Tollywood: ఒక సినిమా విజయవంతం అవడంలో కథకు యెంత ప్రాధాన్యత ఉంటుందో,కథకు తగ్గ టైటిల్ కి కూడా అంటే ప్రాధాన్యతా ఉంటుంది.సినిమా టైటిల్ ను బట్టి కూడా ఆ సినిమా ఎలా ఉంటుందో కొన్ని సార్లు ఉహించుకోగలము.సినిమా లో అభిమాన హీరో హీరోయిన్ ఉన్న కూడా ఆ సినిమా టైటిల్ కూడా బాగుంటేనే సినిమా విజయం సాధించగలదు అని చెప్పవచ్చు.అందుకే ఇండస్ట్రీలో దర్శక,నిర్మాతలు,చిత్ర యూనిట్ సినిమా టైటిల్ విషయంలో చాల జాగ్రత్త తీసుకుంటారు.టైటిల్ ను నిర్ణయించడంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు.ఈ క్రమంలో టాలీవుడ్ లో తమ ఒంటి పేరునే సినిమాకు టైటిల్ గా పెట్టిన ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు.
1980 సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి గారు మనవూరి పాండవులు,న్యాయం కావాలి,ఖైదీ వంటి చిత్రాల విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు.అదే సమయంలో 1985 లో అజయ్ క్రియేషన్స్ లో సి వి రాజేంద్రన్ దర్శకత్వం వహించిన చిరంజీవి అనే చిత్రం రిలీజ్ అయ్యింది.చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా విజయశాంతి నటించారు.భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది.
అన్నపూర్ణ బ్యానర్ లో వి మధుసూధనరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన మొదటి సినిమా విక్రమ్ 1986 రిలీజ్ అయ్యింది.ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం ప్లాప్ అవ్వడం జరిగింది.ఆ తర్వాత జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ లో వి బి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 1986 సంవత్సరంలో కెప్టెన్ నాగార్జున అనే చిత్రం రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో నాగార్జున కు జోడిగా ఖుష్బూ నటించారు.విమాన ఫైలెట్ గా నాగార్జున గారు నటించిన ఒకే ఒక చిత్రం కెప్టెన్ నాగార్జున.అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది.అయితే ఈ ఇద్దరు హీరోలు తమ ఒంటి పేర్లనే సినిమా టైటిల్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.