Tholi Prema: తొలిప్రేమ సినిమాలో పవన్ చెల్లెలు…ఇప్పుడు ఎలా ఉందంటే..!

Tholi Prema
Tholi Prema

Tholi Prema: పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సినిమాలలో తొలిప్రేమ సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో హీరో చెల్లెలిగా నటించిన వాసుకి ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండే ఉంటుంది.తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు వాసుకి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి.వీరిద్దరి మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కంట తడి పెట్టిస్తే మరికొన్ని సన్నివేశాలు కడ్డుపుబ్బా ప్రేక్షకులను నవ్వించి కామెడీ పండించాయి.

నటి వాసుకి అంటే ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ తొలిప్రేమ సినిమా లో పవన్ కళ్యాణ్ చెల్లెలు అంటే మాత్రం యిట్టె గుర్తుపట్టేస్తారు.తొలిప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అని చెప్పచ్చు.ఇక సినిమా లో అన్న చెల్లెలి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో వాసుకి క్లయిమాక్స్ లో తనకు ఇష్టం లేకపోయినా కూడా తనను ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకునే సీన్ అందరిని ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా చివరలో వాసుకి తన అన్నయ్య పవన్ కళ్యాణ్ కు చెప్పే సెంటిమెంట్ డైలాగులు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి.ఈమె చేసింది ఒక్క సినిమా అయినా కూడా ఈ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండి పోయింది వాసుకి.ఇక ఈ సినిమా షూటింగ్ సమయం లోనే ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ అయినా ఆనంద్ సాయి తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది వాసుకి.ఆనంద్,వాసుకి దంపతులకు హర్షిత అనే కూతురు మరియు సందీప్ అనే కుమారుడు ఉన్నాడు.వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన వాసుకి ప్రసుతం గూగుల్ దిగ్గజ సంస్థ లో పనిచేస్తున్నట్లు సమాచారం.సోషల్ మీడియా లో కూడా వాసుకి ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *