Mahesh Babu: అప్పట్లో మహేష్ బాబుకు మరదలిగా..! ఇప్పుడు మహేష్ బాబుకు అత్తగా నటించిన నటి ఎవరో తెలుసా..!

Mahesh Babu

Mahesh Babu: మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం.సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా శ్రీలీల హీరోయిన్ గా నటించింది.తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు త్రివిక్రమ్.ఇక మహేష్ బాబు తల్లి పాత్రలో రమ్య కృష్ణ నటించారు.ముందు నుంచి ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది.అయితే త్రివిక్రమ్,మహేష్ బాబు ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అతడు అందరికి గుర్తుండే ఉంటుంది.అప్పట్లో ఎటువంటి అంచనాలు లేకుండిన రిలీజ్ అయినా ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఒక దొంగ తన వాళ్ళ ఒక కుటుంబానికి అన్యాయం జారకూడదు అని వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సమస్యలు తీర్చడం అనే కథాంశంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు.ఈ సినిమాలోని సింపుల్ డైలాగ్స్ అప్పట్లో అందరిని కట్టి పడేశాయి.ఈ సినిమా డైలాగ్స్ కోసం ఇప్పటికి ఈ సినిమా టీవీ లో ప్రసారం అయితే చూసే వాళ్ళు చాల మందే ఉన్నారు.ఇక సినిమాలో హీరోయిన్ త్రిష కు అక్కగా హారిక నటించారు.హారిక సోగ్గాడి సరదాలు అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఇక అప్పట్లో హారిక పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.అయితే అతడు సినిమాలో లలిత పాత్రలో కనిపించిన హారిక ఆ తర్వాత పెద్దగా సినిమాలలో కనిపించలేదు.అయితే ఇటీవలే విడుదల అయినా గుంటూరు కారం సినిమాలో హారిక హీరోయిన్ శ్రీలీల కు తల్లిగా కనిపించారు.గుంటూరు కారం సినిమాలో శ్రీలీల,మురళి శర్మ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్లలో కనిపించారు.అయితే అతడు సినిమాలో మహేష్ బాబు కు మరదలిగా నటించిన హారిక గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కు అత్తగా నటించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *