Businessman: బిజినెస్ మ్యాన్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!

Businessman
Businessman

Businessman: టాలీవుడ్ లో ఉన్న టాప్ దర్శకులలో పూరి జగన్నాధ్ కూడా ఒకరు అని చెప్పచ్చు.టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పూరీజగన్నాధ్.ఇప్పటి వరకు తన కెరీర్ లో పూరి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఘనత పూరీజగన్నాధ్ ది అని చెప్పచ్చు.దివంగత కన్నడ సూపర్ స్టార్ అయినా పునీత్ రాజ్ కుమార్ ను కూడా పూరి నే సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసారు.అయితే తాజాగా పూరీజగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయినా ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ కు జోడిగా అనన్య పాండే నటించడం జరిగింది.భారీ అంచనాలతో ఆగష్టు 25 న రిలీజ్ అయినా ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది.పూరీజగన్నాధ్ లైగర్ సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మించడం కూడా జరిగింది.రిలీజ్ అయినా మొదటి రోజే ఈ సినిమా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పూరీజగన్నాధ్ తో పాటు ఛార్మి కూడా నష్టపోవటం జరిగింది.

అయితే పూరీజగన్నాధ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలలో మహేష్ బాబు హీరోగా చేసిన బిజినెస్ మ్యాన్ సినిమా కూడా ఒకటని చెప్పచ్చు.ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీ లో ప్రసారం అయితే చాల ఇష్టంగా చూస్తారు ప్రేక్షకులు.ఈ సినిమా లో మహేష్ బాబు మాస్ లుక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.అయితే ఈ సినిమా కథను ముందుగా పూరీజగన్నాధ్ తమిళ్ సూపర్ స్టార్ అయినా సూర్య కు వినిపించారట.కాని కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కపోవడంతో ఇదే కథతో మహేష్ బాబు తో చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *