Site icon HelloBD Newz

Sr NTR: ఎన్టీఆర్ తన కొడుకులు,కూతుర్లు,మనవరాళ్లకు పెట్టిన ప్రత్యేకమైన పేర్లు యేవో తెలుసా…వాళ్ళ పేర్ల వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!

Sr NTR

Sr NTR

Sr NTR: సినిమా రంగంలో కానీ,రాజకీయ రంగంలో కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నందమూరి తారకరామారావు గురించి అందరికి తెలిసిందే.ఆయన రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరవాత పేద ప్రజలకు ఆయన అందించిన పథకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.ఎన్టీఆర్ ను పేద ప్రజలు దేవుడిలా భావిస్తారు.అయితే ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాత్రం చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పచ్చు.

ఎన్టీఆర్,బసవతారకం దంపతులకు 8 మంది కొడుకులు మరియు 4 మంది కూతుర్లు పుట్టారు.ఎన్టీఆర్ గారికి ఆచారాలు,సంప్రదాయాలు,తెలుగు భాష అంటే చాల ఇష్టం.ఆయన తన కొడుకులు,కూతుర్లు మరియు మానవరాళ్లకు పెట్టిన పేర్లను గమనించినట్లయితే ఆయనకు తెలుగు మీద ఉన్న జ్ఞానం అర్ధమవుతుంది.తన కొడుకులు,కూతుర్లు అందరికి కూడా చివరన ప్రాస కుదిరేలా ఆయన నామకరణం చేయడం జరిగింది.ఆయన తన ఏడుగురు కొడుకులకు చివర కృష్ణ వచ్చేలా పేరును పెట్టారు.

ఇక కూతుర్ల పేరు చివరన ఈశ్వరి వచ్చేలా ఆయన పేరును పెట్టారు.ఇక రెండో తరంలో కూడా ఆయన తన పెద్ద కుమారుడు జయకృష్ణ కూతురు పేరు కుదుమిని,అలాగే రెండవ కుమారుడు కూతుర్ల పేర్లు శ్రీమంతుని,మనస్విని అని పెట్టారు.అలాగే బాలకృష్ణ ఇద్దరు కూతుర్లకు బ్రహ్మీని,తేజస్విని అని పేర్లు పెట్టారు.ఇక తన చిన్న కుమారుడు అయినా సాయి కృష్ణ కూతురికి ఈషాని అని ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది.ఈ పేర్లను చూస్తే ఆయన కళాత్మక హృదయం గురించి అందరికి అర్ధం అవుతుంది.ఎన్టీఆర్ ఏది చేసిన కూడా అందులో ప్రత్యేకత ఉంటుందని చెప్పచ్చు.

Exit mobile version