Raasi Husband: టాలీవుడ్ లో ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల తార హీరోయిన్ రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆమె తెలుగుతో పాటు తమిళ్,మలయాళం సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.1997 లో రిలీజ్ అయినా శుభాకాంక్షలు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు రాశి.ఆ తర్వాత తెలుగులో గోకులంలో సీత,పెళ్లి పందిరి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.2020 లో గిరిజ కళ్యాణం తో బుల్లితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చారు రాశి.
ప్రస్తుతం రాశి జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్నారు.తెలుగులో స్నేహితులు,పండగ,గిల్లికజ్జాలు,దేవుళ్ళు వంటి హిట్ సినిమాలను అందుకున్నారు రాశి.సముద్రం సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించారు రాశి.మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వం వహించిన నిజం సినిమాలో నెగటివ్ పాత్రలో రాశి కనిపించడం జరిగింది.1986 లో రిలీజ్ అయినా మమతల కోవెల అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టారు రాశి.
రాశి ఎస్ ఎస్ నివాస్ ను 2005 లో పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం రాశి తన భర్త పిల్లలతో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో హీరోయిన్ రాశి తన ప్రేమకథను చెప్పుకొచ్చారు.అప్పట్లో ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్,కోటీశ్వరులు తన వెంట పడిన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు రాశి.