Sr NTR: తన కెరీర్ లో సీనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాకు ఎక్కువ పారితోషకం తీసుకున్నారో తెలుసా…!

Sr NTR
Sr NTR

Sr NTR: తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉందంటే దానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పడం లో సందేహం లేదు.అప్పట్లో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసారు.తన సినిమా జీవితంలో ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు.ఆయన తన సినిమా కెరీర్ లో ఏ సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే…సాంఘిక,పౌరాణిక,జానపద ఇలా రకరకాలా సినిమాలు చేసిన సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో 300 సినిమాలకు పైగా నటించారు.అప్పట్లోనే ఎన్టీఆర్ మొదట్లో 30 రోజుల కాల్ షీట్ గాను ఆరు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకునే వారు.

అప్పట్లో అది ఎక్కువ పారితోషకం.అడవి రాముడు సినిమాకు ఎన్టీఆర్ 35 లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నారట.అప్పట్లో ఇది చూసి మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ షాక్ కు గురయ్యారట.ఆ తర్వాత ఎన్టీఆర్ తన పారితోషకం కొద్దీ కొద్దిగా పెంచుకుంటూ వెళ్లారట.ఆ తర్వాత రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అక్కడ విజయం సాధించి ముఖ్యమంత్రి గా కొనసాగారు.

ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు ఆయన నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా కూడా రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా కోసం అప్పట్లో ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు పారితోషకం అందుకున్నట్లు సమాచారం.అదే సమయంలో చిరంజీవి 65 లక్షల వరకు పారితోషకం అందుకునే వారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి సారి కోటి రూపాయల పారితోషకం తీసుకున్న హీరోగా సీనియర్ ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *