Satna Titus: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎప్పుడు భిన్నమైన పాత్రలు ఉండే సినిమాలను చేస్తూ ప్రజలను అలరిస్తూ ఉంటారు విజయ్ ఆంటోని. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పటివరకు విజయ్ ఆంటోని చేసిన సినిమాలలో బిచ్చగాడు (Bichagadu) సినిమా చాలా స్పెషల్.
ఈ సినిమాను తెలుగులో డబ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాట్నా టైటస్ (Satna Titus) నటించింది. ఈ సినిమాతో ఈమె దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో నటించింది.
బిచ్చగాడు సినిమా హిట్ కావడంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు బిచ్చగాడు సినిమా తమిళ్ డిస్ట్రిబ్యూటర్ తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పట్లో వీళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు.
View this post on Instagram