Ramya Krishna: రమ్య కృష్ణ ఒకే నటుడికి కూతురిగా,చెల్లిగా మరియు భార్య గా నటించిన ఆ సినిమాలు ఏవో తెలుసా..!

Ramya Krishna
Ramya Krishna

Ramya Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హీరోయిన్ రమ్య కృష్ణ.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.1985 లో భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రమ్య కృష్ణ.కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ లేడీ గా పేరు తెచుకున్నప్పటికీ ఆ తర్వాత ఎంతో కష్టపడి తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.

అప్పటి వరకు ప్లాప్ లు అందుకుంటున్న ఆమె రాఘవేంద్ర రావు గారి అల్లుడు గారు చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఆ తర్వాత ఎక్కువగా రాఘవేంద్ర రావు గారి సినిమాలలో నటించారు.ఇక కుటుంబ,ప్రేమ కథ చిత్రాలతో పాటు దేవత పాత్రలలో కూడా తన నటనను నిరూపించుకున్నారు.నెగటివ్ రోల్ ఉన్న పాత్రలు కూడా చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అయితే కెరీర్ లో ఆమె ఒకే నటుడికి కూతురు,చెల్లి మరియు భార్య గా కూడా చేయడం జరిగింది.

ఆ నటుడు ఎవరో కాదు మంచి సపోర్ట్ పాత్రలతో,విలన్ పాత్రలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నాజర్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో రమ్య కృష్ణ శివగామి పాత్రలో మరియు నాజర్ ఆమె భర్త గా బిజ్జల దేవుడు అనే పాత్రలో నటించారు.అయితే హీరో రజనీకాంత్ నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ నాజర్ చెల్లెలిగా అద్భుతంగా నటించిన సంగతి అందరికి తెలిసిందే.ఇక తమిళ సినిమా అయినా వంత రాజవతాన్ వరువేన్ లో రమ్య కృష్ణ నాజర్ కూతురిగా నటించడం జరిగింది.ఈ సినిమా తమిళ్ లో అత్తారింటికి దారేది రీమేక్ గా తెరకెక్కబడింది.తెలుగు లో నదియా పాత్రను తమిళ్ లో రమ్య కృష్ణ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *