Rakshasudu: ‘రాక్షసుడు’సినిమాలో సూర్య కూతురిగా నటించిన చిన్నారి హీరోయిన్ ల యెంత అందంగా ఉందో తెలుసా..!

Rakshasudu

Rakshasudu: విలక్షణ నటుడు కమల్ హసన్ నుంచి దివంగత హీరోయిన్ శ్రీదేవి నుంచి మొదలు ఎంతో మంది తమ కెరీర్ ను బాలనటులుగా కెరీర్ ను ఆరంభించిన వారే. ఆ కోవలో రాశి, మీనా, హన్సికతో పాటు మరెంతో ఎంతో మంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్టుగానే ప్రారంభించి స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు అదే కోవలో మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా మెరవబోతున్నది.

చిన్నారి పెళ్లి కూతురు ధారావాహికలో ఆనందిగా ఇంటింటికీ పరిచయమైన అవికా గోర్.. ఈ సీరియల్ వస్తుండగానే.. సిల్వర్ స్ర్కీన్ పై హీరోయిన్ గా మారింది. విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో చిన్న కూతురిగా కనిపించిన ఎస్తేర్ అనిల్ కూడా ఇప్పుడు హీరోయిన్ గా తన కెరీర్ ను తీర్చిదిద్దుకునే పనిలో పడింది. ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్లుగా తెరపైకి వస్తున్నారు. ఈ జాబితాలోకి మరో బాలనటి చేరిపోయింది.

కమర్షియల్ చిత్రాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు సూర్య. రజనీకాంత్ , కమల్ హాసన్ తర్వాత సౌత్, నార్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ హీరో సూర్య. పితామగన్ (శివ పుత్రుడు), మణిరత్నం యువ మూవీతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ టాలీవుడ్ లో మాత్రం స్టార్ డమ్ తెచ్చిన సినిమా మాత్రం గజినీ. తమిళ నుంచి తెలుగులోకి డబ్ చేసిన ఈ సినిమా స్ర్టెయిట్ సినిమాలతో పోటీ పడి కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఆరు, నువ్వు నేను ప్రేమ, సింగం, సెవన్త్ సెన్స్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు సూర్య. అలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో రాక్షసుడు ఒకటి. తమిళంలో మాస్ ఎంగిర మసిలామణిగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోకి డబ్ అయ్యింది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సూర్య కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుంది కదా.. ఆ అమ్మాయి ఇప్పుడు బుట్టబొమ్మలా మారి సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది.

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే యువినా పార్థవి. సీరియళ్ల లో బాలనటిగా చేసిన ఈ పాప అజిత్ వీరం, విజయ్ దళపతి కత్తితో పాటు పలు చిత్రాల్లో బాల నటిగా చేసింది. ఇప్పుడు పెద్దదై.. నాజుగ్గా మెరిసిపోతున్నది. ఈ పాప తమిళంతో పాటు కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడు జయం రవి సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్నది. చిన్నప్పుడు బొద్దుగా కనిపించిన ఈ పిల్ల ఇప్పుడు అందానికి కేరాఫ్ అడ్రస్ గా తయారైంది. ఈ చిన్నది ప్రస్తుతం సైరన్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నది. కొత్త దర్శకుడు ఆంథోని భాగ్గరాజ్ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ గా కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈనెల 19న థియేటర్లలో సైరన్ మూవీ విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *