Kanchana 4: రాఘవ లారెన్స్ హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాఘవ లారెన్స్ నటుడిగా, దర్శకనిర్మాతగా, కొరియోగ్రాఫర్ గా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. చివరగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) చంద్రముఖి 2 సినిమాలో నటించడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాఘవ లారెన్స్ సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇప్పటికే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన మూడు సిరీస్ తెలిసిందే. ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాంచన (Kanchana) ఫోర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. తాజాగా కాంచన ఫోర్ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఈమె మరెవరో కాదు ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే (Pooja Hegde). ఇటీవలే పూజా హెగ్డే నటించిన తెలుగు, తమిళ్ తోపాటు హిందీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితే పూజా హెగ్డే కాంచన ఫోర్ సినిమాలో దయ్యం పాత్రలో భయపెట్టనుందని ఒక వార్త గట్టిగా ప్రచారం జరుగుతుంది.
View this post on Instagram