Thandel: చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) లేటెస్ట్ గా నటించిన సినిమా తండెల్ (Thandel). ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 73.20 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ స్వయంగా ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 21.27 కోట్లు కలెక్షన్లు కాబట్టి అక్కినేని నాగచైతన్య కెరియర్లో ఇప్పటివరకు తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమాలో రాజు, సత్య పాత్రలలో నాగచైతన్య సాయి పల్లవి (Sai Pallavi) చాలా అద్భుతంగా జీవించారు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని కొన్ని సన్నివేశాలలో అయితే నాగచైతన్య అందరి చేత కంటతడి పెట్టించేసాడు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జాలర్ల యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందు మొండేటి. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లు రాబట్టి 100 కోట్ల క్లబ్ లో చేరడం పక్క అని తెలుస్తుంది.