Home » సినిమా » Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా… ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.!

Mahesh Babu: మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా… ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.!

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: గుంటూరు కారం సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ హైప్ తో హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమాను రాజమౌళి రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ (Tollywood) స్టార్స్, అలాగే హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మహేష్ బాబుకు సంబంధించిన ఒక త్రో బ్యాక్ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

Also Read: కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కంది.. కానీ అనుకోకుండా సినిమాల్లో అడుగుపెట్టిన ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.!

ఈ ఫోటో ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా… ఇప్పుడిప్పుడే ఈమె టాలీవుడ్లో సినిమా అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు రమ్య పసుపులేటి (Ramya Pasupuleti). ఇటీవల రమ్య మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది.