Kushboo Daughter: హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె కూతురు సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం.ఖుష్బూ (Kushboo) పెద్ద కూతురు త్వరలోనే స్క్రీన్ మీద కనిపించనుంది.ఈ విషయం పై మాట్లాడిన నటి ఖుష్బూ తన కూతురిని దీవించాలి అని కోరారు.ఒకప్పుడు ఖుష్బూ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బా
ఒకప్పుడు ఈమె క్షణం కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేసేవారు.ఖుష్బూ స్టార్ డైరెక్టర్ అయినా సుందర్ ను 2000 లో వివాహం చేసుకోవడం జరిగింది.ఈ దంపతులకు అవంతిక (Avantika),ఆనందితా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.ప్రస్తుతం పెద్ద కూతురు అవంతిక సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి మాట్లాడిన ఖుష్బూ తన పెద్ద కూతురును ఆశీర్వదించాలని అందరిని కోరారు.
ఖుష్బూ మాట్లాడుతూ అవంతిక ఎన్నో కలలతో లండన్ లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకోని ఇప్పుడు సినిమాలలోకి రావడానికి రెడీ గా ఉంది.మేము ఆమెను లాంచ్ చేయడం లేదు మరియు అదే విధంగా మేము సిఫార్సు చేయడం లేదు.ఆమె స్వతాహాగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంది.నా కూతురును అందరు దీవించాలి..అందరి ప్రేమాభిమానాలు అందించాలి అంటూ ఖుష్బూ కోరారు.ఆనందితా అప్పటి ఇప్పటి ఫోటోలు చూసిన నెటిజన్లు షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram