Prabhas Marriage: వారి అంచనాలు అన్ని తారుమారు అయ్యాయి…ఇది కూడా అంతే…ప్రభాస్ పెళ్లి పై స్పందించిన శ్యామలాదేవి..!

Prabhas Marriage

Prabhas Marriage: ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చే పేరు డార్లింగ్ ప్రభాస్.బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తం గా క్రేజ్ ను,ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు ప్రభాస్.దాంతో అటు ప్రభాస్ కుటుంబసభ్యులతో పాటు ఇటు అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం ఎంతో ఆసకిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ ఏ మూవీ ప్రమోషన్స్ కు వెళ్లిన కూడా అక్కడ ప్రభాస్ పెళ్లి గురించి తప్పకుండ ఒక ప్రశ్న అడుగుతారు.ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాతే మేము పెళ్లి చేసుకుంటామని చాల మంది హీరోలు సరదాగా కామెంట్స్ చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే.గతం లో ప్రభాస్ పెళ్లి గురించి చాలా వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో హల్ చల్ చేసాయి.ప్రభాస్ ఫలానా హీరోయిన్ తో ఏడడుగులు వేయబోతున్నారు అంటూ నెట్టింట్లో చాల వార్తలు వినిపించాయి.పలువురు జ్యోతిష్యులు కూడా ప్రభాస్ గురించి చెప్తూ ప్రభాస్ కెరీర్ లో హిట్ పడదని,పెళ్లి కాదని రకరకాల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన ప్రభాస్ ప్రస్తుతం పెళ్లి మాటను పక్కన పెట్టి వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి గురించి చెప్పుకొచ్చారు.ఈమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ మంచి తనం మనిషిని ఏ స్థాయికి తీసుకోని వెళ్తుందో ప్రభాస్ సక్సెస్ ను చూస్తే అర్ధమవుతుంది.కొంత మంది బాహుబలి విజయం తర్వాత ప్రభాస్ కు విజయం దక్కదని అన్నారు.వారి అంచనాలు ఇప్పుడు తారుమారు అయ్యాయి.

ప్రభాస్ పెళ్లి విషయంలో కూడా అలాగే జరుగుతుంది.కోట్లాది మంది అభిమానులు ఆశించినట్లుగా తన సినిమాలు ఉండాలని ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడు.దృష్టి మరలకుండా ఎంతో బాధ్యతగా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.ప్రభాస్ కు పెళ్లి చేయాలనీ మాకు ఉంటుంది.కానీ అందుకు తగిన సమయం రావాలి.ఆ నమ్మకంతోనే ఉన్నాం అంటూ శ్యామల దేవి చెప్పుకొచ్చారు.పై నుంచి అన్ని విషయాలు కృష్ణం రాజు చూసుకుంటారు.ఆయన ఆశించినవీ అన్ని ఇప్పటివరకు జరిగాయి అలాగే పెళ్లి కూడా జరుగుతుంది అని ఆమె చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *