Chiranjeevi: చిరంజీవి పక్కన ప్రేమికురాలిగా,చెల్లిగా మరియు తల్లిగా కూడా చేసిన హీరోయిన్ ఎవరో..ఆ సినిమాలు ఏంటో తెలుసా..!

Chiranjeevi: సినిమా అనే రంగుల ప్రపంచంలో పాత్ర ఏదైనా సరే అలవోకగా ఇమిడే చాతుర్యం ఉండాలి.సినిమా ఇండస్ట్రీలో అలంటి విచిత్రమైన కలయిక చిరంజీవి మరియు సుజాతాది అని చెప్పచ్చు.వీరిద్దరి సినిమా కెరీర్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరూ ఒక్కో సందర్భంలో ఒక్కో కలయికతో కనిపించరు.ప్రేమికులుగా,అన్న చెల్లెలిగా మరియు తల్లి కొడుకులుగా కనిపించి అందరిని అలరించారు.హిందీలో సూపర్ హిట్ అయినా ముకందర్ క సికందర్ అనే సినిమా తెలుగులో పునర్నిర్మాణమే ప్రేమతరంగాలు అనే టైటిల్ తో తెరకెక్కింది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్రలో కృష్ణం రాజు,వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి మరియు రాఖి పాత్రలో సుజాత నటించారు.ఈ చిత్రంలో చిన్న పిల్లవాడు విజయ్ రంగారావు అనే సంపన్నుడి దగ్గర పని చేస్తూ ఉంటాడు.రంగారావు చిన్నకూతురు సుజాత కు ఆ పిల్లవాడికి మధ్య స్నేహం ఏర్పడుతుంది.ఆ తర్వాత 1982 లో రిలీజ్ అయినా సీతాదేవి అనే చిత్రంలో చిరంజీవి మరియు సుజాత అన్న చెల్లెలిగా నటిస్తారు.

ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్న చెల్లెలి కథ చుట్టూ తిరుగుతుంది.ఆ తర్వాత విజయబాపినీడు దర్శకత్వం వహించిన బిగ్ బాస్ అనే చిత్రం 1995 లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో చిరంజీవి సుజాత తల్లి కొడుకులుగా నటించడం జరిగింది.అలా తమ కెరీర్ మొదలైనప్పటి నుంచి చిరంజీవి సుజాత ప్రేమతరంగాలు అనే చిత్రంలో ప్రేమికులుగా,సీతాదేవి అనే చిత్రంలో అన్న చెల్లెలిగా,ఆ తర్వాత బిగ్ బాస్ చిత్రంలో తల్లి కొడుకులుగా నటించడం జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Leave a Comment