Home » సినిమా » IND vs PAK: దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న చిరంజీవి, నారా లోకేష్, సుకుమార్.!

IND vs PAK: దుబాయ్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న చిరంజీవి, నారా లోకేష్, సుకుమార్.!

IND vs PAK
IND vs PAK

IND vs PAK: నేడు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రికెట్ అభిమానులే కాకుండా సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ కూడా ఈ క్రికెట్ మ్యాచ్ లో వీక్షిస్తున్నారు. ఇప్పుడు పలువురు సెలబ్రిటీలు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. చాంపియన్ టోపీలో భాగంగా నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మ్యాచ్ కోసం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫెవిలియన్లో కూర్చొని భారత క్రికెటర్లు తిలక్ వర్మ (Tilak Varma), అభిషేక్ (Abhishek Sharma) లతో కలిసి ఈ క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మరియు దర్శకుడు సుకుమార్ కూడా ప్రత్యక్షంగా దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్నారు.

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni), బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ టీవీలో ఈ మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు 241 ఆల్ అవుట్ అయ్యింది. ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోయినట్లయితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవలసి ఉంటుంది. మరోవైపు భారత తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఈ మ్యాచ్ గెలిచినట్లయితే తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నట్లే.