Namitha: హీరోయిన్ నమిత భర్త కూడా మన అందరికి తెలిసిన నటుడే…ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

Namitha
Namitha

Namitha: తెలుగులో 2002 సంవత్సరంలో రిలీజ్ అయినా సొంతం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మొదటి సినిమాతోనే ఈమె తన అందంతో చాల మంది అభిమానులను సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు.ఆ తర్వాత హీరో వెంకటేష్ కు జోడిగా జెమిని చిత్రంలో నటించింది.కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.ఇక ప్రభాస్ నటించిన బిల్లా సినిమాతో నమిత కు మంచి క్రేజ్ వచ్చింది.ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాలలో అంతగా కనిపించలేదు.

వీరేంద్ర చౌదరిని 2017 లో పెళ్లి చేసుకున్న నమిత ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది అని చెప్పచ్చు.నమిత కొన్ని నెలల క్రితం కవల మగపిల్లలకు జన్మనిచ్చింది.అయితే నమిత భర్త వీరేంద్ర చౌదరి కూడా ఒక నటుడే అనే సంగతి చాల మంది తెలుగు ప్రేక్షకులకు తెలీదు అని చెప్పచ్చు.వీరేంద్ర చౌదరి తమిళ్ లో చాల సినిమాలలో నటించడం జరిగింది.అయితే ఈయన తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు అని తెలుస్తుంది.నమిత తో వివాహం తర్వాత వీరేంద్ర చౌదరి సినిమాలకు దూరంగా ఉంటూ ప్రొడ్యూసింగ్ మీదే తన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న వీరేంద్ర ప్రస్తుతం తానూ ఆరు సినిమాలలో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.అందులో కొన్ని సెట్స్ పై ఉండగా మరికొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.అయితే ఈ ఆరు సినిమాలలోనూ ఆరు డిఫరెంట్ పాత్రలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.అందులో కొన్ని సినిమాలలో ఆయన విలన్ పాత్ర లో కనిపిస్తే మరికొన్ని సినిమాలలో హీరో పాత్రలో నటిస్తున్నానని చెప్పుకొచ్చారు.మంచి కథ దొరికితే తెలుగులో కూడా సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *