Maheswari: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గులాబీ సినిమా హీరోయిన్ మహేశ్వరీ..!

Maheswari
Maheswari

Maheswari: స్వర్గీయ నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.జాన్వీ తన పిన్ని మహేశ్వరీ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తన ఇంస్టా ఖాతాలో షేర్ చేసింది.ఈ ఫోటోలలో మహేశ్వరిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.మహేశ్వరీ అంటే గులాబీ సినిమా హీరోయిన్.ఈమె తన మొదటి సినిమా అయినా అమ్మాయి కాపురం తో మంచి గుర్తింపును సంపాదించుకుంది.తెలుగులో మహేశ్వరీ పెళ్లి,దెయ్యం,మృగం,జాబిలమ్మ పెళ్లి,ప్రియరాగాలు,నీకోసం,మా అన్నయ్య వంటి పలుసినిమాలలో నటించింది.

ఆ తర్వాత వరుస ప్లాప్ లు అందుకున్న ఈమె ఫెడ్ అవుట్ అవ్వడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.మహేశ్వరీ శ్రీదేవి కి సిస్టర్ అవుతుంది అని లేదా శ్రీదేవి అక్క సూర్య కల కూతురు అవుతుంది అని చాల మంది చెప్తుంటారు.

తాజాగా జాన్వీ మహేశ్వరీ తో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో మహేశ్వరీ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని చెప్పచ్చు.ప్రస్తుతం 45 ఏళ్ళు వయస్సు ఉన్న మహేశ్వరీ ని పోల్చుకోవడానికి నెటిజన్లకు కాస్త టైం పడుతుంది.

ఒక షూటింగ్ సందర్భంగా జాన్వీ కపూర్ తన పిన్ని మహేశ్వరీ తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు గులాబీ సినిమా హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *