KGF Villain: కే జి ఎఫ్ సినిమాలో విలన్ గా నటించిన వశిష్ట సింహ గురించి అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో ఈయన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కేజీఎఫ్,(K.G.F) నారప్ప, నాయిమ్ డైరీస్ వంటి పలు సినిమాలలో నటించి మెప్పించాడు. అయితే వశిష్ట సింహ (Vasishta N. Simha) భార్య కూడా ఒక టాలీవుడ్ హీరోయిన్ అన్న సంగతి చాలామందికి తెలియదు. కాలేజీ చదువుతున్న సమయం నుంచి నటన మీద ఆసక్తితో జాబ్ చేస్తున్న కంపెనీ నుంచి బయటకు వచ్చి దృష్టి మొత్తాన్ని సినిమాలపై పెట్టాడు నటుడు వశిష్ట. అలా యష్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించే అవకాశాన్ని అందుకున్నాడు.
అలా విలన్ గా తన కెరీర్ ప్రారంభించాడు. కన్నడ నటుడే అయినప్పటికీ ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. తెలుగులో కూడా ఇతను పలు సినిమాలలో నటించాడు. ఇతని భార్య మరెవరో కాదు హరిప్రియ. హరిప్రియ అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేక పోవచ్చు కానీ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ సినిమాలో సింధు అంటే మాత్రం ఈజీగా గుర్తుపట్టగలరు. తకిట తకిట అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హరిప్రియ.
ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు కానీ పిల్ల జమిందార్ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు తెలుగులో పలు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. అలాగే బాలకృష్ణ నటించిన జై సింహా సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
View this post on Instagram