Site icon HelloBD Newz

Comedian Lakshmipathi Son: కమెడియన్ లక్ష్మీపతి కొడుకు ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉన్న క్రేజీ హీరో…ఎవరో తెలుసా..!

Comedian Lakshmipathi Son

Comedian Lakshmipathi Son

Comedian Lakshmipathi Son: గోదారి యాసతో,తనదైన మాటకారితనం తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీపతి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా తెలుసు.రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత యాంకర్ గా ఈయన పలు షో లకు చేయడం జరిగింది.క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో అడుగుపెట్టిన ఈయన కమెడియన్ గా 50 కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన అల్లరి సినిమా ద్వారా ఈయనకు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పచ్చు.

తన తమ్ముడు దర్శకత్వం వహించిన బాబీ సినిమాలో ఈయన నెగటివ్ పాత్రలో నటించటం జరిగింది.ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ లక్ష్మీపతి కి తమ్ముడు అవుతారు.శోభన్ కొడుకు సంతోష్ శోభన్ తెలుగులో క్రేజీ హీరోగా ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.,లక్ష్మీపతి అల్లరి,అమ్మాయిలు అబ్బాయిలు,తొట్టిగ్యాంగ్,పెదబాబు,కితకితలు,అందాల రాముడు,అత్తిలి సత్తిబాబు LKG వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఆ తర్వాత సినిమా అవకాశాలతో బిజీ గా ఉన్న సమయంలోనే ఈయన గుండెపోటుతో మరణించారు.ఈయనకు శ్వేతా,కేతన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.ఈయన తమ్ముడు కొడుకు సంతోష్ శోభన్ గోల్కొండ హై స్కూల్ సినిమాలో క్రికెట్ టీం కు కెప్టెన్ గా బాగా అలరించారు.ఆ తర్వాత పేపర్ బాయ్ సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు సంతోష్ శోభన్.ప్రస్తుతం ఈయన అన్ని మంచి శకునములే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Exit mobile version