Deepthi Sunaina: దీప్తి సునైనా గురించి అందరికీ తెలిసిందే. టిక్ టాక్ రీల్స్ తో ఈమె మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో మరింత ఫేమస్ అయిపోయింది. బిగ్ బాస్ లో కూడా పాల్గొని తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరచుకుంది. దీప్తి సునైనా (Deepthi Sunaina) యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
సోషల్ మీడియాలో దీప్తి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను రెగ్యులర్గా షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇప్పటికే దీప్తికి కొన్ని టాటూలు ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడు ఒక కొత్త టాటూ ని వేయించుకుంది.
తన ఎడమ చేతి పై వేయించుకున్న ఈ కొత్త టాటూ (Tattoo) వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శివుడు నడుస్తుంటే ఆయన వెంట ఓ అమ్మాయి అనుసరిస్తున్నట్టు ఉంది ఈ టాటూ. ఆ అమ్మాయి తనే అని చెప్పింది దీప్తి. ఆయన నడిచే దారిలో, ఆయన నడిపించే దారిలో వెళ్తాను, శివయ్య ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అని అర్థం వచ్చేలా ఉన్న ఆ టాటూను షేర్ చేసింది దీప్తి.
View this post on Instagram