Daaku Maharaaj OTT: లేటెస్ట్ గా బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి కీలక పాత్రలలో నటించారు.
ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియల్ విలన్ గా ఆకట్టుకున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో బాలయ్య (Bala Krishna) మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమాను బ్లాక్ బస్టర్ హిట్గా నిలిపాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా 4 వంద కోట్ల సినిమాలను అందించిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 9 నుంచి డాకు మహారాజు సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.