Comedian Ali : కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ఇప్పటివరకు వేయికి పైగా సినిమాలు చేసి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. గత కొన్ని రోజుల నుంచి అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పలు టీవీ షో లతో, పాలిటిక్స్ లో కూడా అలీ బిజీగా ఉన్నారు. ఇక అలీ భార్య జుబేదా అలీ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా అలీ (Comedian Ali) మరోసారి పెళ్లి చేసుకున్నాడు. అలీ పెళ్లి అయ్యి ఇప్పటికి 30 ఏళ్లు దాటింది. దాంతో అలీ పెళ్లిరోజున అలీ కూతుర్లు దగ్గరుండి మరి అలీ పెళ్లి చేశారు. తన భార్య జుబేదానే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అలీ.
ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అలీ ఇద్దరు కూతుళ్లు తమ తల్లిదండ్రుల పెళ్లి రోజున వారికి మళ్లీ పెళ్లి చేస్తున్నట్లు, వారి సంప్రదాయంలో పెళ్లి జరిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముస్లిం సంప్రదాయంలో హల్దీ వేడుక, మెహందీ, రిసెప్షన్, వారి సాంప్రదాయం ప్రకారం నికా ఇలా అన్ని వేడుకలను ఇద్దరు కూతుర్లు దగ్గరుండి మరి జరిపించారు.