Lakshmi Sharma: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వడానికి ప్రయత్నాలు చేసి అవకాశాలు రాకపోవడంతో చిన్న క్యారెక్టర్లు చేసి అలరించిన వాళ్ళు ఇండస్ట్రీలో చాల మందే ఉన్నారు.అలా చిన్న క్యారక్టర్ లలో నటించి కూడా ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుండిపోయిన వాళ్ళు ఉన్నారు.సినిమాలు టీవిలో ప్రసారం అయ్యినప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందొ అని చాల మంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి వాళ్లలో ఈ అమ్మాయి కూడా ఒకటి అని చెప్పచ్చు.
ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ మాలయంలో ఒక్కప్పుడు వరుస అవకాశాలతో హీరోయిన్ గా బిజీ గా ఉండేది.ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు లక్ష్మి శర్మ.లక్ష్మి శర్మ అంటే ఎవ్వరు గుర్తుపట్టలేరు కానీ చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇంద్రలో చిరంజీవి మేనకోడలు నందిని అంటే ప్రేక్షకులు చాల ఈజీ గా గుర్తుపట్టేస్తారు.తెలుగులో చాల సినిమాలు చేసిన ఈమె గుర్తింపు రాకపోవడంతో మలయాళం ఇండస్ట్రీ కి వెళ్లిపోయారు.
ఈమె తెలుగులో 2000 లో రిలీజ్ అయినా ఆమ్మో ఒకటో తారీఖు సినిమాలో ఎల్బీ శ్రీరామ్ చిన్న కూతురిగా నటించారు.సారీ నాకు పెళ్లయింది,ఆరుగురు పతివ్రతలు వంటి సినిమాలలో కూడా లక్ష్మి శర్మ నటించింది.అయితే గుర్తింపు రాకపోవడంతో అవకాశాలు కూడా రాకపోవడంతో మలయాళంలో తన దృష్టి పెట్టింది లక్ష్మి శర్మ.ఈమె మమ్ముట్టి తో కలిసి పల్లంకు సినిమాలో నటించి అక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఆ తర్వాత వరుస అవకాశాలతో ఆమె టాప్ హీరోయిన్ గా మారిపోయింది.సినిమాలు చేస్తూనే లక్ష్మి శర్మ తెలుగు,మలయాళంలో భక్తికత సీరియల్స్ లో నటిస్తుంది.