Site icon HelloBD Newz

Chiranjeevi: చిరంజీవి,బాలకృష్ణ ఒకే పాటలో కలిసి నటించిన స్పెషల్ సినిమా ఏదో తెలుసా…!

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ప్రత్యేకస్థానం ఉంది.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి.అలాగే నందమూరి కుటుంబం నుంచి తండ్రిగారి నట వారసత్వాన్ని అందుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు నందమూరి బాలకృష్ణ.ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో ఒకే పాటలో కనిపించారన్న సంగతి బహుశా చాల మందికి తెలియదు.ప్రతి ఇండస్ట్రీలో కూడా పోటీ అనేది ఉంటుంది.

ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నెంబర్ వన్ స్థానాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నటి నటులు.గతంలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు మధ్య ఎప్పుడు పోటీ ఏర్పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అప్పట్లో ఈ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేసేవారు.మల్టీస్టారర్ సినిమాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇక వెంకటేష్,మహేష్ బాబు మరియు వెంకటేష్,పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ మూవీస్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.అలాగే గతంలో చిరంజీవి మరియు బాలకృష్ణ ఒకే సాంగ్ లో కనిపించడం జరిగింది.ఆ సినిమా వెంకటేష్ హీరోగా నటించిన త్రిమూర్తులు.ఇక ఈ సినిమాలోని ఒక పాటలో చిరంజీవి,బాలయ్యతో పాటు నాగార్జున,కృష్ణ,శోభన్ బాబు కూడా కనిపించడం జరిగింది.

Exit mobile version