Sankranthiki Vasthunam: కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నాము. అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ (Venkatesh) కెరియర్ లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతున్నా కూడా థియేటర్లలో ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.
కేవలం మూడు వారాల్లోనే ఈ సినిమా 303 కోట్లు వసూళ్లు సాధించి ఈ సంక్రాంతి విన్నారుగా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా కనిపించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఓటీటిలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా మళ్లీ సంక్రాంతికి వస్తున్న వైబ్స్ ను ఆస్వాదించండి అంటూ ఫస్ట్ టీవీలో రాబోతున్నామంటూ హ్యాష్ టాగ్ తో జి నెట్వర్క్ పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు ముందే టీవీలో ప్రసారం అవుతుందని తెలుస్తుంది. కానీ టీవీలో ఈ సినిమా ఏ రోజు ప్రచారం అవుతుందో తెలియాల్సి ఉంది.