Magadheera: మగధీర సినిమాను ఆ ఒక్క కారణంతో వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

Magadheera
Magadheera

Magadheera: మగధీర సినిమాలో మిత్రవింద పాత్రలో కాజల్ తన నటనతో అందరిని కట్టి పడేసింది.మగధీర సినిమాతో హిట్ అందుకున్న తర్వాత కాజల్ కు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.అయితే మొదట్లో ఈ సినిమా కు కాజల్ ను అనుకోలేదట దర్శకుడు.నిజానికి ఈ సినిమా మరొక స్టార్ హీరోయిన్ చెయ్యాల్సింది.కానీ ఆమె తప్పుకోవడంతో ఈ సినిమా అవకాశం కాజల్ కు దక్కి ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడం జరిగింది.ఇక ఈ సినిమా హిట్ తర్వాత కాజల్ కు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టడం అన్ని కూడా వెంట వెంటనే జరిగిపోయాయి.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమా గా నిలిచింది.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా లో 2009 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వసూళ్ల వర్షం కురిపించింది.రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.80 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా ఒక మెయిలు రాయిగా నిలిచింది అని చెప్పచ్చు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కాజల్ మిత్రవింద పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా హిట్ తర్వాత కాజల్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది.

అయితే మొదట్లో రాజమౌళి ఈ సినిమాలో మిత్రవింద పాత్ర కోసం అనుష్క శెట్టి ని అనుకున్నారట.రాజమౌళి అనుష్క కాంబినేషన్ లో విక్రమార్కుడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో కూడా రాజకుమారి పాత్రలో అనుష్క అయితే బాగుంటుందని రాజమౌళి అనుకున్నారట.కానీ రామ్ చరణ్ అప్పట్లో టీనేజ్ కుర్రాడిలా ఉండడం ఇద్దరికీ సెట్ కాదని ఉద్దేశంతో అనుష్క ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.దాంతో ఈ గోల్డెన్ ఛాన్స్ కాజల్ కి దక్కడంతో ఈ సినిమా తో హిట్ ను సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *