
Childhood Pic: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా రాణించడం సులువైన విషయం కాదు అనే సంగతి అందరికి తెలిసిందే.అయితే రెండు మూడు భాషలలో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు హీరోయిన్లు.
సోషల్ మీడియా లో నటి నటుల చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.ఆ ఫోటోలలో ఉన్న స్టార్స్ ను గుర్తుపట్టడానికి ఫ్యాన్స్ కూడా రెడీ గా ఉంటారు.
ఇప్పుడు ఇదే క్రమంలో కృష్ణుడి గెటప్ లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.ఈ అమ్మడు తెలుగు తో పాటు తమిళ్,మాలయంలో కూడా హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు.ఈ ఫొటోలో కృష్ణుడి గెటప్ లో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిన్నది అనుపమ పరమేశ్వరన్.
ఇది చదవండి: అచ్చం అమ్మలాగే అందంగా ఉన్న లయ కూతురిని చూశారా.. అప్పుడే పలు సినిమాలలో కూడా నటించింది
ఈ అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఆ తర్వాత ఈమెకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.తెలుగులో ప్రేమమ్ సినిమాలో కూడా నటించింది అనుపమ పరమేశ్వరన్.
తెలుగుతో పాటు తమిళ్,మాలయంలో కూడా సినిమాలు చేస్తూ బిజీ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు.తనకు సంబంధించి లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో లో నిత్యం ఆక్టివ్ గా ఉంటుంది అనుపమ.ఇక ప్రస్తుతం సోషల్ మీడియా లో కృష్ణుడి గెటప్లో ఉన్న అనుపమ చిన్ననాటి ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
View this post on Instagram