Anita Hassanandani: టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అనిత అంటే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నువ్వు నేను సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంటుంది.తేజ దర్శకత్వం వహించిన నువ్వు నేను సినిమాలో అనిత హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఈ సినిమాలో అనిత హీరో ఉదయ్ కిరణ్ కు జోడిగా నటించింది.మొదటి సినిమాలోనే తన నటనతో అనిత ప్రేక్షకులను కట్టి పడేసింది.నువ్వు నేను సంచలన విజయం తర్వాత అనిత కు తెలుగులో మరియు తమిళ్ లో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో హిందీ లో సీరియల్స్ లో నటిస్తూ బిజీ గా గడుపుతుంది అనిత.
ఇక అనిత రోహిత్ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఈ దంపతులకు 2021 లో ఒక మగబిడ్డ జన్మించింది.తాజాగా అనిత తన కొడుకు ఆరవ్ రెడ్డి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం అనిత ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇక నువ్వు నేను హిట్ తర్వాత అనిత కు తెలుగు లో మంచి అవకాశాలు వచ్చాయి.అనిత తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను,శ్రీరామ్,తొట్టి గ్యాంగ్,నేను పెళ్ళికి రెడీ,ముసలోడికి దసరా పండుగా వంటి సినిమాలలో నటించింది.ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో 2003 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనిత.ఇక ఆ తర్వాత 2013 లో గోవా లో బిజినెస్ మ్యాన్ అయినా రోహిత్ రెడ్డి ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.