Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ అయ్యింది.అయితే ఈ సినిమా రిలీజ్ టైం లో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇక ఆమె కుమారుడు కూడా ఈ ఘటన జరిగినప్పటి నుంచి హాస్పిటల్ లో కోమాలో ఉన్నాడు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీ లో ఈ ఘటన గురించి హీరో అల్లు అర్జున్ పై మరియు సినిమా ఇండస్ట్రీ పై మండిపడ్డారు.
తన పై వస్తున్నా అభియోగాలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి దీనిపై క్లారిటీ ఇచ్చారు.అయితే ఆయన చెప్పిన దాంట్లో నిజం లేదని అందరు అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణా ప్రభుత్వం అల్లు అర్జున్ కు బిగ్ షాక్ ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ ఘటనలో అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్లు పెట్టింది.
కానీ అల్లు అర్జున్ ఆ కండిషన్లను పాటించకుండా ఇష్టమొచ్చినట్లు ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలంగాణా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శనివారం పెట్టిన ప్రెస్ మీట్ బెయిల్ రూల్స్ కు విరుద్ధం అని పోలీసులు వాపోతున్నారు.చట్టానికి అందరు ఒక్కటే…ఎవ్వరు చట్టం కాదు అంటూ అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు పోలీసులు.వీటిని పరిగణలోకి తీసుకోని నేడు హైకోర్టులో నేడు బెయిల్ రద్దు కోసం పోలీసులు పిటిషన్ వేయనున్నారని సమాచారం.