Actress: సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే అంత సులభమైన పని కాదు. ఎంతో కష్టపడితే గాని ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారి జీవితంలో ఎన్నో ఏళ్ల కన్నీళ్లు కష్టం. ఉంటుంది ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు కూడా ఎంతో కష్టపడితే గాని ఒక స్థాయికి రాలేదు. ముఖ్యంగా మహిళా ఆర్టిస్టుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి కష్టాలన్నీ అధిగమించి ప్రస్తుతం బెస్ట్ కమెడియన్ గా పాపులర్ అయిన ఒక మహిళ స్టోరీ అందరికీ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది.తన కామెడీతో దరిని నవ్వించే ఈ లాఫ్టార్ క్వీన్ జీవితంలో భరించలేని విషాదం ఉంది.
ఒకప్పుడు ఎండిపోయిన రొట్టె ముక్క తింటూ కాలం గడిపిన ఈ నటి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మరెవరో కాదు కపిల్ శర్మ షో ( Kapil Sharma Show) తో బాగా ఫేమస్ అయిన భారతీ సింగ్. తన యూనిక్ కామెడీతో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది భారతి సింగ్ (Bharti Singh). అయితే ఆమె కెరియర్ అంతా ఈజీగా సాగలేదు అని తెలుస్తుంది. ఒక పాడ్క్యాస్ట్ లో పాల్గొన్న ఈమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. భారతికి 2 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి చనిపోయాడు.
దాంతో కుటుంబ భారం మొత్తం ఆమె తల్లి మీద పడింది. భారతి తల్లి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో బ్లాంకెట్లు కుట్టేది. రాత్రి ఇంటికి వచ్చాక స్టిచ్చింగ్ కూడా చేసేది. ఒక్కోసారి తినడానికి తిండి లేక ఒక పూట మాత్రమే తిండి తినేవారట. ఎండిపోయిన రొట్టె ముక్కకు ఉప్పు పెట్టుకుని తినేవాళ్ళమని అలా చాలా రోజులు గడిపామని భారతి తెలిపింది. భారతి సింగ్ కి షూటింగ్ మీద ఆసక్తి ఉండడంతో నేషనల్ లెవెల్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో పంజాబ్ టీం తరపున పాల్గొని. అలా ఆడేటప్పుడు తనకు రోజు 15 రూపాయలు ఇచ్చేవారట. ఉచితంగా భోజనం కూడా పెట్టేవారట. ఇప్పటికీ తనకు షూటింగ్ చేయాలని ఉంటుందని భారతీ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఏమైనా సంపద సుమారు రూ. 30 కోట్లుగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో భారతి చాలా బిజీగా గడుపుతుంది.
View this post on Instagram