Gowthami Daughter: గౌతమి కూతురు చూస్తే షాక్ అవుతారు.. తల్లిని మించిన అందం తనది..!

subbu tadimalla
subbu tadimalla

Gowthami Daughter: నిన్నటి తరం అందాల తారల్లో సౌత్ లో మంచి పేరు తెచ్చకున్న హీరోయిన్ గౌతమి. నటులు వారి వారసులను చిత్ర సీమకు పరిచయం చేయడం మామూలే.. వచ్చిన వారిలో కొందరు వారసత్వాన్ని మోసుకురాగా మరికొందరు వెనకుండిపోయారు. ఈ కోవలోనే మరో స్టార్ హీరోయిన్ గౌతమి తన కూతురును వెండితెరకు పరిచయం చేసే పనిలో బిజీగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సౌత్ లో గౌతమి గురించి దాదాపు తెలియని వారు ఉండరు. తమిళంతో పాటు తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె. ఆమె తన జీవితంలో ఒకరిని పెండ్లి చేసుకోగా అతనితో విడిపోయి, మరొకరితో సహజీవనం చేసింది. తెలుగు, తమిళంలో అగ్రహీరోలందరితో ఆమె నటించి మెప్పించింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందంటే ఆమెకు ఉన్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సందీప్ భాటియా అనే వ్యక్తిని 1998లో పెండ్లి చేసుకున్నారు గౌతమి. వారి బంధం సంవత్సరం మాత్రమే నికొనసాగింది. తర్వాత ఆయనతో ఆమె విడిపోయారు. తర్వాత ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో 20 ఏండ్ల పాటు సహజీవనం చేశారు. మనస్పర్థలతో వీరు కూడా విడిపోయారు. ప్రస్తుతం తన మొదటి భర్త భాటియా తో కన్న కూతురు సుబ్బలక్ష్మితో ఉంటుంది గౌతమి. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె కూతురి ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

తన కూతురు (సుబ్బలక్ష్మి)తో ఆమె దిగిన ఫొటోలను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. హీరోయిన్ అందానికి ఏ మాత్రం తీసుపోని మోము సుబ్బలక్ష్మి సొంతం. తన తల్లి అందాన్ని పునికిపుచ్చుకున్నట్లుగా ఉంది. ఫొటోలను చూసిన నెటిజన్లు బాగా వైరల్ చేస్తున్నారు. ఇక ఆమె ఇండస్ర్టీకి అరంగేట్రం చేయడమే తరువాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పాజిటివ్ కామెంట్లతో తల్లికి తగ్గ కూతురిగా మంచి పేరు సంపాదించుకోవాలంటూ సూచిస్తున్నారు గౌతమి అభిమానులు.

కానీ దీనిపై గౌతమి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తను ఇటీవల ఒక వేదికగా హీరోయిన్ గా, పర్సనల్ లైఫ్ లో పడిన కష్టాలను తన కూతురును పడనివ్వనని చెప్పింది. ఈ నేపత్యంలో తన కూతురును వెండితెరకు పరిచయం చేస్తుందా..? వేచి చూడాలి. పొలిటికల్ టచ్ లో కూడా ఉంటున్నారు గౌతమి. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఆమె రాజకీయాల్లోకి వెళతారంటూ అభిమానులు మాట్లాడుకున్నారు. కానీ ఆమె మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by subbu tadimalla (@maybesubbu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *