Suman Daughter: దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమన్ తెలుగు సినిమాల్లో ప్రముఖ నటుడు.సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కూడా నటించారు.నాగార్జున హీరోగా చేసిన అన్నమయ్య అనే సినిమాలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ అద్భుతంగా నటించారు.అన్నమయ్య చిత్రానికి రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు.
ఇప్పుడు సుమన్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. మానవ జన్యుశాస్త్రంలో బంగారు పతక విజేత అయిన తన కుమార్తె అఖిలజ ప్రత్యూష గురించి సుమన్ ఇటీవల మాట్లాడారు. తనకు నటనపై ఆసక్తి లేదని, ఆమె సాధించిన విజయాలను చూసి గర్విస్తున్నానని సుమన్ అన్నారు. సుమన్ ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడారు, కానీ ఎటువంటి వివరాలు చెప్పలేదు. ఆమె పెళ్లి గురించి వస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు.
తన కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచన ఉందని కానీ ఇంకా పూర్తి స్థాయిలో పెళ్లి గురించి ఆలోచన లేదని సుమన్ చెప్పుకొచ్చారు.సుమన్ తెలుగుతో పాటు తమిళ్ మరియు కన్నడ లో కూడా నటించారు.సుమన్ తన సినిమా కెరీర్ లో దాదాపుగా 150 కు పైగా సినిమాలలో నటించడం జరిగింది.అయితే సుమన్ కంటే ఎంతో అందంగా ఉన్న సుమన్ కూతురి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.