Ravi Krishna: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 7 /జి బృందావన కాలనీ హీరో..!

Ravi Krishna
Ravi Krishna

Ravi Krishna: 7 / జి బృందావన కాలనీ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కల్ట్ క్లాసిక్ సినిమాలలో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని చెప్పచ్చు.ఈ సినిమా 18 సంవత్సరాల క్రితం 2004 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది.ఎటువంటి అంచనాలు కూడా లేకుండా రిలీజ్ అయినా సినిమా హిట్ సాధించింది.ఇక ఈ సినిమాలో మూర్ఖుడిగా కనిపించే హీరో హీరోయిన్ ను మొదటి నుంచి కూడా కామం తోనే చూస్తూ ఉంటాడు.

అలా ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు.ఇలాంటి కథతో సినిమా అప్పట్లో ఇప్పట్లో రాలేదు అని చెప్పచ్చు.మిడిల్ క్లాస్ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాలను కూడా ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రవికృష్ణ స్టార్ ప్రొడ్యూసర్ అయినా ఏ ఏం రత్నం కొడుకు అనే సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమా అప్పట్లో తెలుగు,తమిళ్ భాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాతో రవికృష్ణ తెలుగులో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా హీరోయిన్ కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.అయితే 7 /జి బృందావన కాలనీ సినిమా తర్వాత వీరిద్దరూ పలు సినిమాలలో నటించినప్పటికీ వీరిద్దరికి అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు.దాదాపు 18 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇక ఈ ఫొటోలో హీరో రవికృష్ణ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *